Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య
- నవతెలంగాణ ఫొటోగ్రాఫర్ హరికి ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారం
నవతెలంగాణ-కల్చరల్
భారత రాజ్యాంగం ప్రజాస్వామ పద్ధతిలో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ విభాగాలుగా రూపొందించగా పత్రికా రంగం రాజ్యాంగ పరిరక్షణ అనే గురుతర బాధ్యత నిర్వహిస్తోందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. రవీంద్రభారతి ప్రధాన వేదికపై శృతిలయ ఆర్ట్స్ అకాడమీ నిర్వహణలో సీల్వెల్ కార్పొరేషన్ బండారు సుబ్బారావు సౌజన్యంలో ఉత్తమ పాత్రికేయ శిరోమణి, విశిష్ట సేవా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవాగుణం పాత్రికేయుల లక్షణంగా ఉండాలన్నారు. లింగ, కుల, మత, ప్రాంత విభేదాలకు అతీతంగా రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపొందించగా.. ప్రస్తుతం దేశంలో ఈ సమస్యలు కనిపిస్తున్నాయన్నారు. శాసనమండలి సభ్యులు మధుసూదనాచారి మాట్లాడుతూ.. సమాజ హితం కోసం పాత్రికేయులు పనిచేస్తారన్నారు. దీర్ఘకాలం దూరదర్శన్‌లో పనిచేసిన శైలజ సుమన్‌ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. హరి(నవతెలంగాణ), రవిచంద్ర (జ్యోతి), నిర్మల రెడ్డి(సాక్షి), రూప వాణి, యజ్ఞ మూర్తి, మురళీధర, మాధవి, అంజద్ బాబు, సుమబాల, శ్రీదేవిని ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలతో, రామకృష్ణ, సర్ధార్ హార్బన్ సింగ్, ఆనంద రాజును విశిష్ట సేవా పురస్కారాలతో సత్కరించారు. ఎన్.చంద్రశేఖర్ అధ్యక్షత వహించిన సభలో కళాపత్రిక రఫీ, లక్హోతియా తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ గాయని ఆమని నిర్వహణలో రాజ్ కుమార్ శ్రీనివాస్, సుభాష్, గాయత్రి తదితరులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి.