Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌గా బి.రాజమౌళి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాజ మౌళికి సమాచార పౌర సంబంధాల శాఖ అధి కారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలి పారు. ఈ సందర్బంగా అదనపు డైరెక్టర్లు నాగయ్య కాంబ్లె, ఎల్ఎల్ఆర్ కిషోర్ బాబు, జాయింట్ డైరెక్టర్లు జగన్, శ్రీనివాస్, కెవి రమణ, మీడియా అకాడమీ సెక్రటరీ ఎన్. వెంకటేశ్వర రావు , జీహెచ్ఎంసి సీపీఆర్వో మూర్తుజా, సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్లు ఎం. మధుసూదన్, యాసా. వెంకటేశ్వర్లు, పాండురంగారావు, జి. ప్రసాదరావు, రాజారెడ్డి, కెవి సురేష్, అసిస్టెంట్ డైరెక్టర్లు ఇతర అధికారులు, ఉద్యోగులు శాఖ డైరెక్టర్ బి.రాజమౌళికి అభినందనలు తెలిపారు. సుదీర్ఘకాలం వివిధ స్థాయిల్లో చాలా మంది అధికారులు, సిబ్బందితో కలిసి పనిచేసిన అనుభవాలను ఈ సందర్బంగా బి. రాజమౌళి గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్‌కుమార్ ల ఆకాంక్షలకు అనుగుణంగా సమాచార పౌర సంబంధాల శాఖను పటిష్టపరచనున్నట్టు రాజమౌళి తెలిపారు. .