Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్: వరంగల్ జిల్లా నర్సంపేటలో మేఘా గ్యాస్ సిటీ గేట్ స్టేషన్ (సీజీఎస్)ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఈ సీజీఎస్ స్టేషన్ ప్రారంభంతో వరంగల్ జిల్లాలో గృహ, వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులకు పైప్డ్ నేచురల్ గ్యాస్‌ను మేఘా గ్యాస్ సరఫరా చేయనుంది. త్వరలోనే హన్మకొండ, ఖాజీపేట, వరంగల్ పట్టణాల వినియోగదారులు సురక్షితమైన వంటగ్యాస్‌ను ఈ సిటీ గేట్ స్టేషన్ ద్వారా పొందవచ్చు. మేఘా గ్యాస్ ఇప్పటికే ఖాజీపేట, హన్మకొండ, వరంగల్‌లో సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించి వాహనాలకూ, పరిశ్రమలకూ గ్యాస్‌ను అందిస్తుంది. త్వరలో రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో త్వరలో సీజీఎస్ స్టేషన్లను ప్రారంభించనున్నట్టు మేఘా గ్యాస్ సీఈఓ వెంకటేష్ తెలిపారు. తెలంగాణాలో ఇప్పటి వరకు 15 సీఎన్జీ స్టేషన్లను మేఘా గ్యాస్ ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపి మాలోత్ కవిత, ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. గోపి, మేఘా గ్యాస్ సీఈఓ పి వెంకటేష్, డీజీఎంలు టి తిమ్మారెడ్డి, దేవా చంద్రశేఖర్, వరంగల్ మేఘా గ్యాస్ ఇంచార్జి నాయుడు హరీష్ పాల్గొన్నారు.