Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాణానికి రూ.2,679 కోట్లు కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. గచ్చిబౌలి, ఎల్బీనగర్, సనత్నగర్, అల్వాల్లో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ జీవో జారీ చేసింది. ఎల్బీనగర్, అల్వాల్, సనత్నగర్లో రూ.2,679 కోట్లతో వాటి నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఎల్బీనగర్లో నిర్మించనున్న ఆస్పత్రికి రూ.900 కోట్లు, సనత్నగర్ ఆస్పత్రికి రూ. 882 కోట్లు, అల్వాల్ ఆస్పత్రికి రూ. 897 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎల్బీనగర్, అల్వాల్, సనత్ నగర్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఆస్పత్రుల నిర్మాణం కోసం టెండర్లు పిలవాలని ఆర్ అండ్ బీ శాఖను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.