Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ మానవహక్కుల కమిషన్‌కు బక్క జడ్సన్ ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై కఠన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్కజడ్సన్ కోరారు. కేటీఆర్‌కు, అజయ్‌కి వ్యాపార సంబంధాలు ఉన్నందువల్లే ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను పోలీసుల అండలతో వేధిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్తఫా, మిక్కిలినేని నరేందర్‌పై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని పేర్కొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ ప్రోద్బలంతో పోలీసు అధికారులు తనపై 16 కేసులతోపాటు రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారనీ, ఆ వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు సాయిగణేష్ మరణించే ముందు మీడియాకు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్య తీసుకోవాలని ఆయన కోరారు.