Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో 22లక్షల సిమిలర్ ఓట్ల గుర్తింపు
- అఖిలపక్ష సమావేశం లో ఎన్నికల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో బోగస్ ఓట్ల ఏరివేతకు రాష్ట్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తున్నది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని బుద్దభవన్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ వికాస్ రాజ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిమిలర ఫొటోల ఎంట్రీ,ఎపిక్ కార్డులపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 22లక్షల వరకు సిమిలర్ ఓటర్లు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో అత్యధికంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 90వేల సిమిలర్ ఓట్లు ఉన్నట్టు ఈసీ నోట్ విడుదల చేసింది. మహబూబాబాద్‌లో 11వేలు, వరంగల్ 23వేలు 297 సిమిలర్ ఫొటో ఎంట్రీలు ఉన్నట్టు గుర్తించారు. ఈ సిమిలర్ ఫొటో ఎంట్రీలలో కొన్ని బోగస్ ఓట్లు కూడా ఉండోచ్చని వికాస్ రాజ్ చెప్పారు. బోగస్ ఓట్లను త్వరలోనే గుర్తిస్తామన్నారు.