Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
2022-23 ఆర్థిక సంవత్స రంలో బ్యాంకు లింకేజీ రుణాల టార్గెట్ రూ.15 వేల కోట్లుగా సెర్ప్ నిర్ణయించింది. ఈ మేరకు సెర్ప్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వు లను జారీ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2021-22 ఆర్థిక సంవత్స రంలో ఎస్‌హెచ్‌జి బ్యాంక్ క్రెడిట్ లింకేజీలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు జిల్లా కలెక్టర్లం దరికీ అభినందనలు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌హెచ్‌జి ఎస్‌లకు బ్యాంక్ క్రెడిట్ చెల్లింపులు రూ. 12,000 కోట్లు టార్గెట్ కాగా రూ.12,046 కోట్లు జరిగాయనీ, ఆర్థిక లక్ష్యంలో 105.05 శాతమని తెలిపారు. ఎస్‌హెచ్‌జి బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ (ఎస్‌హెచ్‌జి-బిఎల్‌పి) గ్రామీణ పేదలు, ముఖ్యంగా మహిళల సామాజిక, ఆర్థిక మరియు ఆర్థిక సాధికారత కోసం దాదాపు 46 లక్షల కుటుంబాలను కవర్ చేసే 4.30 లక్షల ఎస్‌హెచ్‌జిలకు ప్రధాన ఆధారమని తెలిపారు. 2022-23కు సంబంధించి జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్దేశించామని పేర్కొన్నారు.