Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాభసాటి పంటల కోసమే : మంత్రి నిరంజన్‌రెడ్డి వివరణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పంటల మార్పిడిలో భాగంగా ప్రభుత్వం వరి పంట వేయద్దంటున్నదే కానీ ఆ పంటపై ఆంక్షలు విధించడం కాదనీ, లాభసాటి పంటల సాగును ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. 'తెలంగాణ రైతన్న అన్నదాత మాత్రమే కాదు. వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చే స్ఫూర్తి ప్రదాత' అంటూ సీఎం పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈమేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తన పంటతో రైతు మార్కెట్‌కు పోవడం కాదనీ, కల్లం కాడికే మార్కెట్ రావాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. కొంత మంది స్వార్థ పరులకు ఈవిషయం అర్థం కాకున్నా... రైతులు మాత్రం అర్థం చేసుకు న్నారనీ, అందుకే రైతులు ప్రత్యామ్నాయ పంటల దిశగా సాగుతున్నారని వివరించారు. వరికి మించి లాభదాయకంగా ఉన్న పత్తి, కంది, పెసలు, మినుముల సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.