Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎంల ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎంలకు గత ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించక పోవడం తీవ్ర అన్యాయమని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.నర్సింహా విమర్శించారు. గురువారం కోఠిలోని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఏఎన్ఎంలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దాదాపు 1,216 మంది సిబ్బంది ఔట్ సోర్సింగ్ విధానంలో గత ఎనిమిది నెలలుగా విధులు నిర్వహిస్తున్న వారికి జీతాలు చెల్లించటంలో ప్రభుత్వాధికారులు, ఏజెన్సీ ఏ మాత్రం పట్టించుకోకుండా విధులు మాత్రం చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి డీఎంహెచ్ఓ అధికారులను ఏజెన్సీలను ఎన్ని పర్యాయాలు అడిగిన వారు సమస్యను పరిష్కరించటం లేదని తెలిపారు. వెంటనే జీతాలు చెల్లించనిచో పూర్తిస్థాయి ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం కమిషనర్ అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ వాకాటి కరుణ మాట్లాడుతూ వారం రోజుల్లో ఈ కార్మికులందరికీ ఎనిమిది నెలల జీతాలు చెల్లిస్తామని వారు సందర్బంగా ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమా రాజేష్, ఏఎన్ఎమ్స్ యూనియన్ ప్రతినిధులు ప్రమీల, అనూషా, ఎస్కె. నసీమా, రాజ్యలక్ష్మి, శిరోమణి, రాధికా, ఉషాా, చందన, గీతా, సంధ్య, కృష్ణవేణి, ఉమా తదితరులు పాల్గొన్నారు.