Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా
నవతెలంగాణ - తంగళ్ళపల్లి
టెక్స్టైల్ పార్క్ సంక్షోభం నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి, మూతపడుతున్న పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ పవర్లూమ్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి టెక్స్టైల్ పార్క్ గేటు ఎదుట గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులందరికీ మెరుగైన వేతనాలు అందించి, టెక్స్టైల్ పార్క్లో 50 శాతం విద్యుత్ సబ్సిడీ అమలు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న విద్యుత్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆర్డర్లను అందించాలని, టెక్స్టైల్ పార్క్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వం పరిశ్రమలు ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టి అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, టెక్స్టైల్ పార్క్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కూచన శంకర్, సీఐటీయూ నాయకులు మోర అజరు, గోవిందు లక్ష్మణ్, శ్రీనివాస్, మోహన్, యాదగిరి, రమేష్, సదానందం, రవి, శేఖర్, రాజమల్లు, రంగయ్య, పవర్లూమ్, అనుబంధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.