Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ సంతాపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాకర్ రావు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. దేవులపల్లి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అదే విధంగా మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ తదితరులు ప్రభాకర్‌రావుకు సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 2016, ఏప్రిల్ 29 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం చైర్మెన్‌గా కొనసాగుతున్నారు.
తెలంగాణ సాహితి సంతాపం
తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర్‌రావు మృతి పట్ల తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లభాపురం జనార్ధన్, కె ఆనందాచారి సంతాపాన్ని తెలియజేశారు. వారి కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు.