Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఎంఎస్టీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్ఎంఎస్టీఎఫ్) హర్షం ప్రకటించింది. సర్వీసు నిబంధనల ప్రకారమే బదిలీలు, పదోన్నతులు కల్పించాలని కోరింది. ఈ మేరకు టీఎస్ఎంఎస్టీఎఫ్ అధ్యక్షులు బి కొండయ్య, ప్రధానకార్యదర్శి ఎస్ మహేశ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. బదిలీలు, పదోన్నతులు కల్పించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, మోడల్ స్కూల్ అదనపు సంచాలకులు ఉషారాణి, టీఎస్‌యూటీఎఫ్ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే మోడల్ స్కూల్ సర్వీసు నిబంధనల ప్రకారం ప్రిన్సిపాళ్లకు గరిష్ట సర్వీసు నాలుగేండ్లు, ఉపాధ్యాయులకు ఐదేండ్లు పూర్తి చేసుకున్న వారికి బదిలీలు తప్పనిసరిగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఉపాధ్యాయులందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు.