Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్
వేసవిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా నూటికి నూరు శాతం సురక్షిత మంచి నీటిని అందించడం ద్వారా సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేర్చాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను అదేశించారు. శుక్రవారం వేసవిలో మంచి నీటి సమస్యల మీద ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులు, సర్పంచులతో హైదరాబాద్లో ఉన్న మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. నీటి ఎద్దడిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ, సమన్వయం చేస్తూ, తగిన విధంగా అధికారులు పని చేయాలని సూచించారు. పంపుల నిర్వహణ, లీకేజీలు లేకుండా చూసుకోవడం, ఫిల్టర్ బెడ్ల క్లీనింగ్, సమస్యలు ఉత్పన్నమైతే ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సర్పంచులతో నుంచి ఆయా గ్రామాల మంచినీటి సరఫరా పై మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో సీఎంవో మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజినీర్ ఇన్ చీఫ్ కపాకర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, ఈఈలు, ఎస్ఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.