Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకొండి : ఉషారాణి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో 2022-23 విద్యాసంవత్సరంలో ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మోడల్ స్కూళ్ల ప్రాజెక్టు డైరెక్టర్ జి ఉషారాణి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. అదేరోజు ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని వివరించారు. దరఖాస్తు చేసిన విద్యార్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. విద్యార్థులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలనీ, పరీక్ష కేంద్రాల్లోకి మాస్క్ ధరించి రావాలనీ, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఆరో తరగతి ప్రవేశాలకు 39,505 మంది, ఏడు నుంచి పదో తరగతి వరకు 33,696 మంది కలిపి మొత్తం 73,201 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారనీ, వారిలో 75 శాతం మంది విద్యార్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని వివరించారు. మిగిలిన 25 శాతం మంది విద్యార్థులు డౌన్లోడ్ చేసు కోవాలని సూచించారు. హాల్టికెట్లను http://telanganams.cgg.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.