Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి సంజరుకి మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆరునెలల్లో ఆర్టీఎస్ను పూర్తి చేస్తామంటున్న బీజేపీ అధ్యక్షులు బండి సంజరు...దాన్ని ఎలా పూర్తి చేస్తారో కాయితం మీద రాసిస్తారా? అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆర్టీఎస్ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏయే పనులు చేపడతావు? ఎక్కడి నుంచి నిధులు తెస్తావో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు,రిజర్వాయర్ల గురించి సంజరుకు తెలియదు కానీ ఆరునెలల్లో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. ఆర్టీఎస్ చివరి ఆయకట్టుకు కర్ణాటకను ఒప్పించి సాగునీరు తెచ్చే దమ్ముందా? అంటూ బీజేపీ ఉపాధ్యక్షులు డికెఅరుణను ప్రశ్నించారు.నిజాం ప్రభుత్వం పూర్తి చేసిన ఆర్టీఎస్ కాలువ ద్వారా కర్ణాటక సంపూర్ణంగా నీరిచ్చిన దాఖలాల్లేవని పేర్కొన్నారు. ఆలంపూర్కు 15.9 టీఎంసీల నీరందించాలి కానీ ఇప్పటివరకు అది అమలు కాలేదని విమర్శించారు. ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు మద్దతుగా సీఎం కేసీఆర్ అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. దీని ఫలితంగానే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ నియమించిందని తెలిపారు. ఇప్పటికైనా బండి సంజరు, డికె అరుణ ఆర్టీఎస్పై అవగాహన పెంచుకోవాలని సూచించారు.