Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీయూసీ చైర్మెన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ హయాంలో దేశంలో దరిద్రపు పాలన కొనసాగుతున్నదని ప్రభుత్వరంగ సంస్థల (పీయూసీ) చైర్మెన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. మనదేశంలో పెట్రోల్ ధరలు, నిత్యావసరాల రేట్లతో జనం బెంబేలెత్తిపోతున్నారని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మన కంటే చాలా చిన్న దేశమైన భూటాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.70 ఉంటే, ఇండియాలో మాత్రం రూ.112గా ఉందని గుర్తు చేశారు. పెరిగిన ధరల గురించి మాట్లాడమంటే బీజేపీ నేతలు తిట్ల దండకం అందుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లోనే విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.