Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జంటనగరాల్లోని విద్యార్థినీ విద్యార్థుల కోసం జవహార్ బాల్ భవన్ లో ఈ నెల 25నుంచి జూన్ ఐదో తేదీ వరకు ప్రత్యేక సమ్మర్ క్యాంపు నిర్వహించనున్నట్టు ఆ సంస్థ సంచాలకులు డాక్టర్ జి ఉషారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 50 సభ్యత్వ రుసుముతో ఏడాది కాలం పాటు విద్యార్థినీ విద్యార్థులు తమకు ఇష్టమొచ్చిన కళలలో శిక్షణ పొందొచ్చని తెలిపారు. నృత్యం (భరతనాట్యం), జానపద నృత్యం, చిత్రలేఖనం, రంగులు వేయటం, సైన్స్, యోగా, క్యారమ్స్, చెస్, తబలా, సంగీతం,స్కేటింగ్, లైబ్రరీ తదితర అంశాలలో తర్ఫీదు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు అధికంగా ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి తక్కువ రుసుముతో 40రోజులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇతర వివరాలకు 23233956,7095035959 నెంబర్లను సంప్రదించాలని కోరారు.