Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదామని ప్రజలకు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పిలుపునిచ్చింది. శుక్రవారం లెనిన్ 153వ జయంతి, సీపీఐ(ఎంఎల్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని మార్క్స్భవన్లో న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రజెండాను ఎగరేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లెనిన్ నాయకత్వంలో 20వ శతాబ్ధపు ప్రారంభంలో రష్యాలో సాయుధ తిరుగుబాటు ద్వారా సోషలిస్టు విప్లవం సాధించుకున్నారని గుర్తు చేశారు. ఇది ప్రపంచంలోని అన్ని దేశాలపైనా ప్రభావం చూపిందని చెప్పారు. ఆ ఉద్యమం అనే మందిని కమ్యూనిస్టు యోధులుగా తీర్చిదిద్దిందని అన్నారు.