Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ సాహిత్య అకాడమీతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఎంతో వెనుకబడి ఉందని ఏపీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీని శుక్రవారం ఆయన సందర్శించారు. తెలంగాణ సాహితీ మూర్తులు, ఇక్కడి భాష కోసం కృషి చేసిన మహనీయుల చరిత్రను పుస్తకాలుగా వెలువరించటం అభినందనీయమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
దేశంలో కేరళ సాహిత్య అకాడమీ పురోగతిలో ఉండేదనీ, ఇప్పుడు తెలంగాణ సాహిత్య అకాడమీ సైతం అదే స్థాయిలో పురోగమిస్తున్నదని చెప్పారు. ఎక్కడా లేని విధంగా బాల సాహిత్యంపై తెలంగాణ సాహిత్య అకాడమీ చేస్తున్న కృషి ఎంతో గొప్పగా ఉందని వివరించారు. ఇటీవల మన ఊరు, మన చెట్టు అనే అంశంపై నిర్వహించిన కథల పోటీలో సుమారు ఐదు లక్షల మంది బాలలు పాల్గొనటం... భవిష్యత్‌లో తెలుగు సాహితీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ ఈ సందర్భంగా బుద్ధ ప్రసాద్‌కు పునాస సాహిత్య మాస పత్రికను అందజేశారు.