Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చల్లబడ్డ వాతావరణం.. పలుచోట్ల వర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. పలుచోట్ల భారీ నుంచి తేలికపాటి వర్షాలుపడ్డాయి. రంగారెడ్డి జిల్లా తాళ్లకొండపల్లి మండలం చుక్కాపూర్లో భారీవర్షం కురిసింది. టీఎస్డీపీఎస్ లెక్కల ప్రకారం అక్కడ 6.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలతో పాటు సంగారెడ్డిలోనూ మోస్తరు వర్షాలు పడ్డాయి. మొత్తం మీద రాష్ట్రంలో శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల వరకు 55 ప్రాంతాల్లో వర్షం కురిసింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది. పలుచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. రాష్ట్రం మీదుగా ఉపరిత ద్రోణి నెలకొన్న నేపథ్యంలో వచ్చే మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల(గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం)తో కూడిన వర్షం పడొచ్చని పేర్కొన్నారు. దక్షిణ, తూర్పు దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం మీదుగా కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఒక్కరోజులోనే నాలుగైదు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. శుక్రవారం వనపర్తి జిల్లా కొత్తపల్లి, ములుగు జిల్లా మేడారంలో అత్యధికంగా 40.9 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.