Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 84 గ్రామాల సమగ్రాభివృద్ధిపై ఉన్నతాధికారులతో సీఎస్ భేటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని జంట జలాశయాల చుట్టుపక్కల ఉన్న 84 గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం సంబంధించిన జీవో 69 అమలు కోసం రాష్ట్ర సర్కారు కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగానే శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
సీఎం కేసీఆర్ సూచనల మేరకు మొత్తం ప్రాంతాన్ని గ్రీన్ బఫర్ జోన్లుగా అభివృద్ధి చేయడంలో భాగంగా జలవనరుల సంరక్షణ, కాలుష్య నియంత్రణ, హై ఎఫిషియెన్సీ ఎస్టీపీల ఏర్పాటు, మౌలికవసతుల కల్పన, వ్యవస్థాపరమైన నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు , ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎమ్డీ దాన కిషోర్, టీఎస్‌పీసీబీ సభ్య కార్యదర్శి నీతూప్రసాద్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, హెచ్ఎమ్డీఏ ప్లానింగ్ డైరెక్టర్ బాలకృష్ణ, జీహెచ్ఎమ్సీ సీసీపీ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.