Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లికి వ్యకాస, ఫీల్డు అసిస్టెంట్ల సంఘం వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న ఫీల్డు అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నారాయణగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. జాప్యం జరగకుండా విధుల్లోకి తీసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి ఎర్రబెల్లి స్పందిస్తూ 'మీ ఉద్యోగాల గురించి అంతా అయిపోయింది. మిమ్మల్ని ఏ విధంగా తీసుకోవాలనేది ఆలోచిస్తున్నాం. మీరు ఆగమాగం కావద్దు. త్వరలోనే మీరు ఉద్యోగాలలో చేరబోతున్నారు' అని భరోసా కల్పించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులు అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, నాయకులు వెంకటయ్య, మండల రాజు తదితరులు పాల్గొన్నారు.