Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాయి గణేశ్ ఆత్మహత్యపై పిల్
- హైకోర్టులో అత్యవసర విచారణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య ఘటనపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలన్న కేసులో రాష్ట్ర రోడ్డు, రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. కేంద్ర, రాష్ట్ర హోం శాఖల కార్యదర్శులతోపాటు ఖమ్మం పోలీసు కమిషనర్, ఖమ్మం మూడవ పట్టణ ఎస్హెచ్వో, సీబీఐ డైరెక్టర్, టీఆర్ఎస్ నాయకుడు ప్రసన్న కృష్ణ, సీఐ సర్వయ్యలకు కూడా నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. సాయిగణేష్ ఆత్మహత్య ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలనీ, మృతుడి కుటుంబానికి పరిహారం ఇచ్చేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన న్యాయవాది డాక్టర్ కె.కృష్ణయ్య లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం అత్యవసరంగా విచారణ జరిపింది. పోలీసుల వేధింపులతోనే సాయిగణేష్ ఆత్మహత్య చేసుకున్నాడనీ, ఇదే విషయాన్ని అతను చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయన్నారు. తన చావుకు మంత్రి పువ్వాడ కారణమని ఆరోపించినా పువ్వాడ ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. సాయిగణేష్పై సుమారు పది కేసులు పెట్టారని, మంత్రి ప్రోత్సాహం, పోలీసుల అత్యుత్సాం వల్లే ఆత్మహత్య జరిగిందన్నారు. మంత్రి అక్రమాలపై సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెస్తుంటే చట్ట ప్రకారం ఏమీ చేయలేక తప్పుడు కేసులతో విధించారన్నారు. చనిపోయాక మృతుడి తల్లికి రూ.50 లక్షలు, కారు ఇస్తామని కొందరు ప్రలోభాలకు గురిచేశారన్నారు. ఆత్మహత్య ఘటనపై పోలీసుల కేసు నమోదు జరిగిందని, దర్యాప్తు కూడా మొదలైందని ఏజీ ప్రసాద్ చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు కల్పించుకుని, ప్రతివాదుల వాదనల తర్వాతే విచారణ చేసి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది.