Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగంలో దేశంలోనే వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) విద్యాసంస్థ తొమ్మిదో ర్యాంకు సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో 346వ ర్యాంకులో నిలిచింది. ఈ మేరకు వీఐటీ వైస్ చాన్సలర్ ఎస్వి కోటరెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల క్యూఎస్ ర్యాంకులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్ట్స్, హ్యుమానిటీస్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, లైఫ్ సెన్సెస్, మెడిసిన్, న్యాచురల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్ విభాగాల్లో ర్యాంకులను ప్రకటించిందని వివరించారు. గతేడాది పోల్చితే 55 ర్యాంకులను దాటి ముందుకొచ్చిందని తెలిపారు. వీఐటీని ప్రఖ్యాత విద్యాసంస్థగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో వీఐటీ 12వ ర్యాంకు సాధించిందని వివరించారు.