Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు నిర్వాహణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎగుమతులను పెంచటానికి వీలుగా వాటాదారుల ఔట్రిచ్ కార్యక్రమానికి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నది. భారతదేశం-యుఎఇ సమగ్ర, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఇపీఏ), ఇండియా-ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (ఈసీటీఏ)పై వాటాదారుల ఔట్రీచ్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ వాణిజ్య విభాగం నేడు(శనివారం) హైదరాబాద్లో నిర్వహిస్తున్నది. ఎగుమతులపై రాష్ట్రానికి చెందిన పరిశ్రమ వర్గాలు, ఎగుమతిదారులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెస్సిల్ ), భారత ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతుల ప్రోత్సాహ మండలి వంటి ఎగుమతుల ప్రోత్సాహక మండళ్లు, రత్నాలు ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహ మండలి (ఇపీసీలు) , భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఫిక్కీ) లాంటి పరిశ్రమ సమాఖ్య సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఔట్రీచ్ కార్యక్రమం వల్ల రాష్ట్రానికి చెందిన సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) ఒప్పందాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుంది. యుఏఇ, ఆస్ట్రేలియా దేశాలకు వస్తువులు, సేవల ఎగుమతులపై కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలతో దేశం అత్యధిక ఎఫ్టీఏ రాయితీలు, ఒప్పందాలను పొందింది. ఈ ఒప్పందాల వల్ల అందుబాటులోకి వచ్చే వ్యాపార, వాణిజ్య అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రయోజనాలు పొందేందుకు ఎగుమతిదారులకు ఔట్రీచ్ కార్యక్రమం సహాయ పడుతుందని నిర్వాహకులు తెలిపారు. దీనివల్ల ఈ రెండు దేశాలకు భారతదేశం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి. అవి పెరగడం వల్ల లక్షలాది కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీంతో దేశ ప్రజలకు సంక్షేమ ఫలాలు మరింత గా అందుబాటులోకి వస్తాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక, సంస్కృతి, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హాజరవుతారు. గౌరవ అతిథులుగా కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ , రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొనే ఈ కార్యక్రమంలో స్థానిక పరిశ్రమల, వ్యాపార, పెట్టుబడి దారుల రంగాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరవుతారు.