Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన గ్రామీణ శాస్త్రవేత్త మండాజి నర్సింహాచారి రూపొందించిన ఇంస్టాషిల్డ్ వైరస్ కిల్లర్ పరికరాన్ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు శనివారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రకమైన పరికరాల ఉత్పత్తికి వీలుగా పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రభుత్వపరంగా సహకరిస్తామని హామీనిచ్చారు. ఆవిష్కరణ అద్భుతంగా ఉందంటూ చారిని అభినందించారు.
రెండేండ్లు శ్రమించి....
రెండేండ్లు శ్రమించి అన్ని రకాల వైరస్ లు, బాక్టీరియాలను సంహరించే పరికరాన్ని ఆవిష్కరించానని నర్సింహాచారి ఈ సందర్బంగా తెలిపారు.కరోనా మూలాల్ని తెలుసుకుని పలు ప్రయోగాలు చేయడం ద్వారా నెగెటివ్ ఎలక్ట్రాన్ల సహాయంతో సంహరించే ఇంస్టాషిల్డ్ మెడికల్ డివైస్ ను విడుదల చేస్తున్నట్టు తెలిపారు.