Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర గవర్నర్‌కు పీఆర్వోగా ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని నియమించుకున్నారని సామాజిక మాద్యమంలో, కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలో వాస్తవం లేదని రాజ్‌భవన్ ఖండించింది. ఈ మేరకు గవర్నర్ కార్యదర్శి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వార్త ఆధారం లేనిదనీ, అసత్యమైనదని తెలిపారు. రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తిని గతంలో గానీ, ప్రస్తుతం గానీ గవర్నర్ కార్యాలయంలో పని చేసేందుకు నియమించేలేదని స్పష్టం చేశారు. ఈ వార్త కేవలం దురుద్దేశంతో వ్యాపింపజేస్తున్నారని పేర్కొన్నారు. రాజ్ భవన్ అన్ని వేళలా రాజకీయ తటస్థతను కొనసాగిస్తుందని వివరణ ఇచ్చారు.
మెడికల్ పీజీ ఆశావహులతో గవర్నర్
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మెడికల్ పీజీ ఆశావహ అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.పాండిచ్చేరి రాజ్‌నివాస్ నుంచి గవర్నర్ నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకున్నారు.