Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షమాపణ చెప్పాలి....లేదంటే చట్టపరమైన చర్యలు
- మంత్రి పువ్వాడ అజరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఖమ్మంలో 20 ఏండ్లుగా నడుస్తున్న మమత మెడికల్ కాలేజీలో పీజీ అడ్మిషన్లు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి తమ కాలేజీపై రాష్ట్ర గవర్నర్కు తప్పుడు ఫిర్యాదు చేశారని ఖండించారు.
ఒక్క సీటునైనా బ్లాక్ దందా చేసినట్టు నిరూపిస్తే తన కాలేజీని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తాననీ, నిరూపించలేకపోతే పక్షంలో రేవంత్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కౌన్సిలింగ్ అలాట్ మెంట్ సమయంలోనే తమ కాలేజీలు సీట్లు నిండిపోతుంటాయనీ, తమకు బ్లాక్ దందా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.