Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రైతుల సౌలభ్యం కోసం వ్యవసాయ శాఖ వినూత్న పద్దతిలో మొబైల్‌యాప్‌ను ఆవిష్కరించింది. వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్ రావు వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయాధికారులు శనివారం హాకాభవన్‌లో ఆవిష్కరించారు. ఈ మొబైల్ యాప్‌లో రైతులకు సంబంధించి విత్తన సౌలభ్యత, ఎరువుల పంపిణీ, రైతు బంధు, రైతుభీమా తదితర అంశాలపై రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించడమే కాకుండా ప్రభుత్వానికి, రాష్ట్ర రైతాంగాన్ని అనుసంధించే ప్రక్రియ కూడా ఈ యాప్‌లో వుందని పేర్కొన్నారు.