Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని సింగరేణికి మరో జాతీయస్థాయి అవార్డు లభించింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి (ఎస్టీపీపీ) మరో జాతీయస్థాయి గుర్తింపు వచ్చింది. ఉత్తమ ఫ్లైయాష్ యుటిల్కెజేషన్ ప్లాంట్‌గా ఎస్టీపీపీని గుర్తించారు. వరుసగా రెండో ఏడాది ఎస్టీపీపీకి ఉత్తమ ఫ్లైయాష్ యుటిల్కెజేషన్ అవార్డ్ లభించింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి వెలువడే ఫ్లైయాష్‌ను సిమెంటు కంపెనీలకు సరఫరా చేస్తున్నారు. గోవాలో 'మిషన్ ఎనర్జీ ఫౌండేషన్' నుంచి అవార్డును డైరెక్టర్ (ఇఅండ్ఎండీ) డి సత్యనారాయణరావు స్వీకరించారు. దక్షిణ భారతదేశంలో 500 మెగావాట్లు అంతకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ కేంద్రాల జాబితాలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు ఈ పురస్కారం దక్కింది.