Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బాలబాలికల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైన్నే ఉందని య షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన సెమ్స్ ఒలింపియాడ్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు సోమవారం హైదరాబాద్‌లోని సత్యసాయి నిగమాగమనంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి వారికి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ మాజీ అధికారి జేడీ లక్ష్మినారాయణ, ట్రస్మా అధ్యక్షులు కందాల పాపిరెడ్డి, సెమ్స్ కన్వీనర్ రామచంద్రారెడ్డి, కో-ఆర్డినేటర్ ఎస్‌ఎన్‌రెడ్డి, ట్రస్మా ప్రముఖులు సుదర్శనాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సైన్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, జనరల్ నాలెడ్జ్ అంశాలలో విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహించటం అభినందనీయమన్నారు. తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తుంటారని చెప్పారు.అదేవిధంగా ఉపాధ్యాయులూ విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా, అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని చెప్పారు. ఈ పరీక్షల్లో దేశంలోని 700 పాఠశాలల నుంచి 40వేల మంది విద్యార్థులు పాల్గొనగా,500మంది అత్యుత్తమ ఫలితాలు సాధించారు.వీరికి నగదు పురస్కారాలతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశారు.