Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బీసీ స్టడీ సర్కిల్, టీఎస్పీఎస్సీ గ్రూప్1,2 తోపాటు ఎస్ఐ పరీక్షల కోసం స్టడీ మెటీరియల్, పుస్తకాలు,డిజిటల్ మెటీరియల్, వీడియోలు, లైబ్రరీలకోసం స్టడీ మెటీరియల్ కొనుగోలుకు ప్రముఖ ప్రచురుణ కర్తలు, రచయితలు, స్టడీ మెటీరియల్ సబ్జెక్ట్ నిపుణుల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె. అలోక్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ స్టడీ మెటీరియల్, రెండు కాఫీలు, సాప్ట్కాపీతోపాటు లాగిన్ వివరాలను అంగీకార పత్రంతో డైరెక్టర్ బీసీ స్టడీ సర్కిల్‌కు సమర్పించాలని కోరారు. బీసీ స్టడీ సర్కిల్, తెలంగాణ, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ భవనం, వడ్డెర బస్తీ పెట్రోల్ పంపు దగ్గర, ఉస్మానియా యూనివర్సిటీ వెనుక రోడ్, హైదరాబాద్-500007 అడ్రస్‌కు వచ్చే నెల మూడో తేదీ సాయంత్రం ఐదు గంటలో అందించాలని కోరారు. స్టడీ మెటీరియల్ ఎంపిక నాలుగు పారామీటర్లలో ప్రతిదానిపై నిపుణుల కమిటీ సిఫారసుతో జరుగుతుందని తెలిపారు. ఎంపిక చేసిన ప్రచురుణలు వచ్చే నెల పదో తేదీన ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు. మిగతా వివరాలు, దరఖాస్తు నిబంధనలు, బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ ''షషష. ్రbషర్బసyషఱతీషశ్రీవ.ఱఅ'' లోని టెండర్ బటన్‌లో ఉన్నట్టు తెలిపారు.