Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురు అరెస్టు, నిర్భంధం
- సీపీఐ(ఎంఎల్ )ప్రజాపంథా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలనీ, వాటిని రూ. ఐదువేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడి కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి, నిర్భంధించారని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నారాయణపేట, గద్వాల, వరంగల్, పెద్దపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 25 చోట్ల ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడించారని తెలిపారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.పోడు భూముల్లో ఫారెస్టు అధికారుల దౌర్జన్యాలను ఆపాలని పేర్కొన్నారు. పోడు రైతులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు.