Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే , జాతీయ కమిషన్ సభ్యులు ఆచారి,గోలి శ్రీనివాస్ రెడ్డి హాజరు
నవ తెలంగాణ వెల్డండ
వెల్డండ మండల పరిధిలోని కొట్ర గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవాలయ పున ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ధ్వజ స్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ , జాతీయ బీసీ కమిషన్ ఆచారి , ఎమ్మెల్సీ గోరటి వెంకన్న , టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి , సింగిల్ విండో చైర్మెన్ ఉడత భాస్కర్ రావు, వైస్ చైర్మన్ సంజీవ్ కుమార్ యాదవ్ , టీఆరెఎస్ మండల అధ్యక్షులు భూపతి రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పోనుగోటి వెంకటేశ్వర్ రావు ,ఆలయ అర్చకులు ,గ్రామస్థులు వారికి ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు హౌమాలు ,పూజలు నిర్వహించి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహి ంచారు. భకుతులు అధిక సంఖ్యలో పాల్గొని ధ్వజ స్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం పాల్గొన్నారు.ఫోటో. వెల్డండ మండలం కొట్ర లో ద్వజ స్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ , ఆచారి ,గోలి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పుణ్యమూర్తి జంగయ్య యాదవ్, రాముల్ను, రవీందర్ రావు, భాస్కర్ రావు, కిషన్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.