Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఐఏఎస్ అధికారులపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదంటూ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ వ్యాఖ్యలు హాని కలిగించేవిగానూ, అవమానించేవిగానూ ఉన్నాయని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు తీవ్రంగానూ, పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొంది. అవి ప్రజల్లో సివిల్ సర్వెంట్ల వ్యక్తిగత ఆత్మగౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయనీ, భవిష్యత్తులో ఇలాంటి బాధ్యాతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని హితవు పలికింది.