Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ కార్మికులకు ఒక డిఏ విడుదలకు నిర్ణయం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆర్టీసీ కార్మికులకు ఆరు డిఏలు ఇవ్వాల్సి ఉండగా, దానిలో ఒక డిఏను విడుదల చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్టు సమాచారం. అయితే ఆ ఒక్క డిఏ కూడా 5.3 శాతం ఇవ్వాల్సి ఉండగా, 5 శాతం మాత్రమే ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన పాయింట్ 3 శాతం ఎందుకు కట్ చేశారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. మిగిలిన ఐదు డిఏలు ఎప్పుడు ఇస్తారో కూడా ప్రకటించలేదు. 2019 జులై నుంచి ఆర్టీసీ కార్మికులకు డిఏలు రావల్సి ఉంది. నిర్ణయించిన ఒక్క డిఏను ఈనెల వేతనంతో కలిపి, వచ్చేనెల మొదటితేదీ జీతంలో ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.