Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాకుంభ సంప్రోక్షణలో కేసీఆర్ దంపతులు
- పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
- ఎక్కడికక్కడ నిర్వాసితుల ముందస్తు అరెస్టులు
నవతెలంగాణ - యాదాద్రి
యాదగిరిగుట్ట లకిë నరసింహస్వామి అనుంబంధ ఆలయం పర్వతవర్దినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ పున: ప్రారంభ కార్యక్రమంలో సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దంపతులు పాల్గొన్నారు. తొలుత గుట్టలో సీఎం కేసీఆర్ దంపతులు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లారు. ఆలయ అర్చకులు వేదోచ్చారణతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో సీఎం దంపతులు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శివాలయ మహా కుంభాభిషేకంలో భాగంగా యాగశాలలో మహా పూర్ణాహుతిలో కేసీిఆర్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం 'పర్వతవర్దిని సమేత శ్రీ రామలింగేశ్వర ప్రధాన ఆలయానికి వెళ్లారు. పూర్ణాహుతి అనంతరం సీఎం కేసీఆర్ దంపతులు తిరిగు ప్రయాణమయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గుతకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, జిల్లా పరిషత్ చైర్మెన్‌్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, కలెక్టర్ పమేలా సత్పతి, దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మెన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్, జెడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య పాల్గొన్నారు.
గుట్టలో సీఎం పర్యటన సందర్భంగా అరెస్టులు
యాదగిరిగుట్టలో సీఎం పర్యటన సందర్భంగా నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. రాత్రికి రాత్రే పోలీసులు భారీగా మోహరించారు. ఆటో కార్మికులు వారి కుటుంబాలతో ఆదివారమే ధర్నాకు దిగడంతో ముందస్తుగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. నియోజకవర్గంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు గుట్టపైకి ఆటోలను అనుమతించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. బస్వాపురం రిజర్వాయర్ భూనిర్వాసితులను, సీపీఐ నాయకులను అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులను వామపక్ష నాయకులు ఖండించారు. తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో బడి, గుడి ఉన్న రోడ్డులో అవి తొలగించొద్దని సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం ఇవ్వాలని ప్రయత్నించిన వారిని అరెస్టు చేసి బొమ్మలరామారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వాసాలమర్రిలో ఆగిన కాన్వారులో సర్పంచ్ పొగుల ఆంజనేయులను ఎక్కించుకొని సీఎం గుట్టకు వెళ్లారు. ఆటో కార్మికుల అరెస్టులను సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహా, యాదగిరిగుట్ట మండల కార్యదర్శి బబ్బూరి పోశెట్టి, సీపీఐ కార్యదర్శి బబ్బూరి శ్రీధర్, మోటకొండూర్ కార్యదర్శి గాదెగాని మాణిక్యం తీవ్రంగా ఖండించారు.