Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
'టీఆర్ఎస్ దొంగల ముఠాను కాంగ్రెస్ కలుపుకునే ప్రసక్తే లేదు. 2004 నుంచి రాష్ట్రం ఇచ్చిన వరకూ, వలసల పేరుతో ఆయన మా పార్టీకి చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావు. 2023 ఏప్రిల్ నాటికి సరిగ్గా 12 నెలల సమయంలో 90సీట్లతో కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఇక ప్రశాంత్‌కిషోర్ వివిధ పార్టీలతో ఉన్న రాజకీయ, ఆర్థిక సంబంధాలు తెంచుకుంటేనే కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తామని హైకమాండ్ స్పష్టం చేసింది' అని రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. వరంగల్‌లో రైతు సంఘర్షణ పేరుతో నిర్వహించే రాహుల్‌గాంధీ సభ విజయవంతానికి ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణులతో విస్తృతస్థాయి సమావేశాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ ఆఫీసులో సోమవారం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
రాష్ట్రంలో కేసీఆర్‌ను పడగొట్టే శక్తి, బీజేపీని ఎదగనీయకుండా నిలువరించే స్థాయి కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. ఈనెల నుంచి సరిగ్గా 2023 ఏప్రిల్ వరకు 12 నెలల సమయం ఉందని, అప్పుడు కర్నాటకతోపాటు తెలంగాణలోనూ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. 90సీట్లను గెలుచుకుని సొంతంగానే కాంగ్రెస్ అధికారం చేపడుతుందన్నారు. తమను అడ్డుకునేందుకే దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉన్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి లాంటి జిల్లాల్లో బీజేపీ నేత సంజరు పాదయాత్ర చేస్తున్నారని, అది కేసీఆర్ కనుసన్నల్లోనే సాగుతుందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆగం చేసి దొంగాట ఆడాయని విమర్శించారు. వరి వేస్తే ఉరే అని రైతాంగాన్ని బెదిరించిన కేసీఆర్ తీరా ధాన్యం కొనేందుకు సిద్ధం కావడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఢిల్లీ వాడేమో గల్లీలో.. గల్లీ వాడేమో ఢిల్లీలో ధర్నా చేసి రాష్ట్రంలోని 20లక్షల ఎకరాల్లో వరి వేయని రైతాంగాన్ని మోసం చేశారని వివరించారు. రాష్ట్ర రైతాంగానికి భరోసాగా తాము అండగా ఉంటామని, రాహుల్‌గాంధీ పాల్గొంటున్న రైతు సంఘర్షణ సభకు విజయవంతం చేయాలని కోరారు.
అన్ని బంధాలు తెంచుకుంటేనే..
రాజకీయ వ్యూహకర్తగా పిలువబడుతున్న ప్రశాంత్‌కిషోర్ కాంగ్రెస్‌లో చేరుతానని వచ్చిన మాట వాస్తవమేనని, అయితే పార్టీ హైకమాండ్ ఈ విషయమై ఓ కమిటీ వేసిందని రేవంత్‌రెడ్డి వివరించారు. ఆ కమిటీ ప్రశాంత్‌కిషోర్ రావడానికి కచ్చితమైన నిబంధనలను సూచించిందన్నారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్సేతర పార్టీలతోనూ, ముఖ్యంగా మోడీ, ఆయన ప్రభుత్వంతో ఉన్న రాజకీయ, ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలని స్పష్టం చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీఆర్ఎస్తో అంటకాగితే పీకేను కాంగ్రెస్ పార్టీ ఎలా చేర్చుకుంటుందని ప్రశ్నించారు.