Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం మే ఆరున జరుగనున్నది. హైదరాబాద్‌లోని జలసౌధలో ఈ భేటీ నిర్వహిస్తారు. సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నీటిపారుదలశాఖ అధికారులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా గెజిట్ అమలు, బోర్డు నిర్వహణ, కృష్ణా జలాల పంపిణీపై బోర్డు ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చించనున్నది. అలాగే బోర్డుకు శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలను అప్పగింత, ప్రాజెక్టుల డీపీఆర్‌లు, విద్యుత్ ఉత్పత్తి, డ్యామ్ సేఫ్టీ, రాజోళిబండ డైవర్షన్ స్కీమ్‌తో పాటు శ్రీశైలం, సాగర్ రూరల్ కర్వ్‌లు, చిన్ననీటి పారుదల, ఏపీకి బోర్డు తరలింపుపై కూడా మాట్లాడనున్నారు. ఈ మేరకు కేఆర్ఎంబీ ఇరు రాష్ట్రాల అధికారులకు సమాచారం ఇచ్చింది.