Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంకేతికంగా గుర్తించి పట్టుకున్న డీఆర్ఐ అధికారులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
దేశంలోకి డ్రగ్స్‌ను రవాణా చేయడానికి గాను కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్న స్మగ్లర్లు ఈ మారు కోట్ల రూపాయల డ్రగ్స్‌ను ఏకంగా కడపులో దాచుకొని రావడం సంచలనం రేపింది. ఇటువంటి ఒక స్మగ్లర్ గుట్టును డీఆర్ఐ అధికారులు రట్టు చేసి ఏకంగా రూ. 11.57 కోట్లు విలువైన కొకైన్ మాదక పదార్థాన్ని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. డీఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఒక టాంజానీయన్ దేశస్తుడు అత్యంత రహస్యంగా కొకైన్ మాదక పదార్థాలతో దేశంలోకి అడుగు పెడుతున్నట్టు డీఆర్ఐ అధికారులకు అత్యంత విశ్వసనీయమైన సమాచారం అందింది. దీంతో ఈనెల 21వ తేదీన జోహన్స్ బర్గ్ నుంచి వయా దుబారు ద్వారా శంషాబాద్ అంతర్జాతీయ ఏయిర్ పోర్టుకు చేరుకున్న ఎమిరేట్స్ విమానంలో వచ్చిన టాంజానీయన్ను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.