Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని రాజ్ భవన్లో మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంపును నిర్వహించారు. ఇటీవల రాజ్ భవన్ సిబ్బంది ఒకరు ఆకస్మికంగా గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. శిబిరంలో కాలేజీ డాక్టర్లు, టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బందితో పాటు గవర్నర్ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్, సంయుక్త కార్యదర్శి జె.భవానీ శంకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.