Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధాని నరేంద్రమోడీ స్వరాష్ట్రం గుజరాత్లో రైతులు కరెంటు కోతలతో రోడ్డెక్కారనీ, ఆయన పాలనలో దేశంలో చైనా దిగుమతులు పెరిగాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వృద్ధి రేటు 11.7 శాతముంటే దేశ వృద్ధి రేటు 6.59 శాతం మాత్రమేనని తెలిపారు. బీజేపీ నేతలది అవగాహన లేని అపరిపక్వత రాజకీయమని విమర్శించారు. తయారీ రంగంలో 17.4 శాతం ఉన్న వాటాను 25 శాతానికి పెంచుతామని మోడీ ప్రకటించినా... అది 14.3 శాతానికి పడిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ రంగంలో 2016లో ఐదు కోట్లున్న ఉద్యోగాలు మూడు కోట్లకు పడిపోయాయని విమర్శించారు. 15.62 లక్షల ఉద్యోగాలు కేంద్రంలో ఖాళీగా ఉంటే భర్తీచేసింది కేవలం 4.45 లక్షలు మాత్రమేనని తెలిపారు. మోడీ పాలనలో అన్ని రంగాలు తిరోగమనంలో ఉన్నాయని సింగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.