Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యాన శాఖ సంచాలకులు వెంకట్రామ్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రం నుంచి మామిడి ఎగుమతులను గణనీయంగా పెంచాలని కొనుగోలు, అమ్మకందార్ల సమావేశంలో నిర్ణయించారు. మంగళవారం హైదరాబాద్లో భారత వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి మండలి (ఏపీఈడీఏ), తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి సంస్థ(టీఎస్హెచ్డీసీఎల్) సంయుక్త సమావేశం జరిగింది. జగిత్యాల్,నాగర్కర్నూల్,రంగారెడ్డి,మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట్, వికారాబాద్, వనపర్తి, యదాద్రి, మహబూబ్నగర్, మంచిర్యాల్ నుంచి మామిడి రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ సంచా లకులు ఎల్ వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ ఎగుమతి, కొనుగోలు దారుల ప్రాముఖ్యతను వివరించారు. మామిడి 3.05 లక్షల ఎకరాల నుంచి 11.48 లక్షల టన్నుల దిగుబడి వస్తుందన్నారు. అపెడ ఏజీఎం నాగ్పాల్ మాట్లాడుతూ మామిడి ఎగుమతులను ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో అఖిల్ గవార్, రామకృష్ణారెడ్డి, విద్యాధర్, జివికె నాయుడు, ఎండీ రఫీ, బి బాబు తదితరులు మాట్లాడారు.