Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ నడుపుతున్న 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో 2022-23 విద్యాసంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ఆర్జేసీ సెట్ దరఖాస్తు గడువును ఈనెల 30వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఆ సంస్థ కార్యదర్శి సిహెచ్ రమణకుమార్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీలో 35 జూనియర్ కాలేజీల్లో ప్రవేశం కోసం ఇతర వివరాల కోసం http://tsrjdc.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.