Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్‌పై జగ్గారెడ్డి ఫైర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఉద్యమకారుల శవాల మీద ఎమ్మెల్యే బాల్కసుమన్ సెటిల్ అయ్యారనీ, అలాంటి వ్యక్తి తమ జాతీయ నేత రాహుల్‌గాంధీ గురించి మాట్లాడటం సిగ్గుచేటని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. కేసీఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమం వెనక ఉన్నది కాంగ్రెస్ కాదా? ఉస్మానియాలో విద్యార్ధులు ఆత్మహత్య చేసుకునేటప్పుడు నీవ్వెందుకు ఆపలేదని సుమన్‌ను ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. 'డెడ్‌బాడీల మీద సుమన్ ఎమ్మెల్యే, ఎంపీ అయ్యావు. కోటీశ్వరుడివి కూడా అయ్యావు. వాళ్ళ డెడ్ బాడీల మీద రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాడా? వాళ్ళ శవాల మీద కేసీఆర్ సీఎం, కొడుకు మంత్రి, కూతురు ఎంపీ, అల్లుడు మంత్రి అయ్యారు' అని విమర్శించారు. వారితోపాటు బాల్కసుమన్ కూడా ఆర్థికంగా సెటిల్ అయ్యారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న గాదె ఇన్నారెడ్డి కనీసం కార్పొరేటర్ కూడా కాలేదనీ, సుమన్ ఎమ్మెల్యే అయితే ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు అంతా ఎమ్మెల్యే ఐనట్టా? అని ప్రశ్నించారు. ఒక్కసారి ఓడిపోతే, కనుమరుగై పోతావు జాగ్రత్త అని హెచ్చరించారు. రాహుల్ గాంధీ గురించి ఇంకోసారి మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.