Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతులకు గవర్నర్ ఉద్బోధ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రభుత్వం నిర్దేశించిన వయో ప్రామాణికత ప్రకారమే మహిళలు వివాహం చేసుకోవాలని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. ఆడపిల్లల వివాహ కనీస వయోపరిమితిని కేంద్రప్రభుత్వం 18 నుంచి 22 ఏండ్లకు పెంచిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఐసీఎమ్ఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) సంయుక్తాధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ 131వ జయంతి, బాబూ జగ్జీవన్రాం 115వ జయంతి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ప్రామాణిక వయస్సులో వివాహం చేసుకోవడం వల్ల తల్లీ, బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. పౌష్టికాహార ఆవశ్యకతను వివరించారు. మహిళా సాధికారితకు విద్యే ప్రధానమని చెప్పారు. భారత రాజ్యాంగం మహిళలకూ సమాన అవకాశాలు కల్పించిందనీ, వాటిని అందిపుచ్చుకోవడంలో చొరవ చూపాలని అన్నారు. కార్యక్రమంలో ఎన్ఐఎన్ డైరెక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు.