Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృత్తి రక్షణ, సంక్షేమం, సామాజిక భద్రతపై చర్చ : లెల్లెల బాలకృష్ణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మత్స్యవృత్తి రక్షణ, సంక్షేమం, సామాజిక భద్రత తదితర మత్స్యకారుల సమస్యలపై చర్చించేందుకు వీలుగా మే 11, 12 తేదీల్లో మత్స్యకార మూడో జాతీయ మహాసభలను పశ్చిమబెంగాల్లోని ఉల్బేరియా ప్రాంతంలో నిర్వహిస్తున్నట్టు అఖిల భారత మత్స్యకారులు, మత్స్యకార్మిక సమాఖ్య జాతీయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ తెలిపారు. దేశ వ్యాప్తంగా మత్స్యవృత్తిని కాపాడాలి. కోట్లాది మంది మత్స్యకారుల జీవిత భద్రత, ప్రజానీకానికి పౌష్టికాహారం అందించాలనే డిమాండ్‌తో మహాసభలు జరుగుతాయని చెప్పారు. మంగళ వారం హైదరాబాద్‌లోని సుందరయ్యవిజ్ఞాన కేంద్రం లో ఆ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గొరెంకల నర్సింహ్మా అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా లెల్లెల మాట్లాడుతూ మహాసభలు అమరజీవి పితబసన్ దాస్ నగర్లో జరగబోతున్న సభలను సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ప్రారంభిస్తారనీ, మొత్తం 500 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి 20 మంది ప్రతినిధులు హాజరవు తారని చెప్పారు. కరోనాతో అనేక ఇబ్బందులకు గురైన మత్స్య పరిశ్రమను ఆదుకోవాలని కోరారు. కేంద్ర బడ్జెట్లో సరైన నిధులు కేటాయించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకార కుటుంబా నికి కరోనా సాయం కింద ప్రతినెలా రూ.అకౌంట్లలో పదివేలు జమ చేయాలనీ, సహజంగా మరణించిన మత్స్యకార కుటుంబానికి రూ 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చే విధంగా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన ఆ కుటుంబాలకు గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఆయా రాష్ట్రాల పరిధిలోనే రూ 10 లక్షల ఆర్థిక సహాయం వచ్చే విధంగా చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. జలవనరులపై పూర్తి హక్కులు మత్స్యకారులకే ఇచ్చేవిధంగా చట్టం చేయడంతో పాటు మత్స్య సంపదకు మార్కెట్ వసతి, గిట్టుబాటు ధర కల్పించాలనే అంశాలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి కొప్పుపద్మ, రాష్ట్ర నాయకులు సీహెచ్ వెంకన్న, ముఠా దశరథ్, పూస నాగమణి, పి సత్యనారాయణ, ఎం జగదీష్ తదితరులు పాల్గొన్నారు.