Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం వెల్లడి
- అభినందిస్తూ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దేశంలో మొదటి పది ఆదర్శ గ్రామాలు మన తెలంగాణ రాష్ట్రానివే కావడం విశేషం. ఇదే విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ తన వెబ్సైట్లో పేర్కొన్నది. సన్సద్ ఆదర్శ్ గ్రామీణ యోజన పథకం కింద ఎంపికైన గ్రామాల వివరాలను తాజాగా ఆ వెబ్సైట్లో పెట్టారు. దేశంలోని మొదటి 20 ఆదర్శ గ్రామాల్లో19 గ్రామాలు తెలంగాణకు చెందినవే కాడం గమనార్హం. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరారవుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆ శాఖ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుని అభినందిస్తూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్వీట్ చేశారు. దీనికి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు రీ ట్వీట్ చేస్తూ సీఎం కేసీఆర్ నిర్దేశించిన పల్లె ప్రగతి ద్వారానే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. స్వచ్ఛత, ఈ-పంచాయతీ, ఈ-ఆడిటింగ్, బహిరంగ మల విసర్జన రహిత (ఓడిఎఫ్) వంటి అనేక అంశాల్లో ఆయా గ్రామాలు ఇప్పటికే ఆదర్శవంతంగా ఉన్నాయి.
ఇవీ ఆ టాప్ 10 గ్రామాలు...వాటి ర్యాంకులు
1 యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి (స్కోర్-92.17)
2. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ (స్కోర్-91.7)
3. నిజామాబాద్ జిల్లా పల్డా (స్కోర్-90.95)
4. కరీంనగర్ జిల్లా వీణ వంక మండలం రామకష్ణాపూర్ (స్కోర్-90.94)
5. యాదాద్రి భువనగిరి జిల్లా అలేరు మండలం కొలనుపాక (స్కోర్-90.57)
6. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మాల (స్కోర్-90.49)
7. జగిత్యాల జిల్లా ఇబ్రహీం పట్నం మండలం మూల రాంపూర్ (స్కోర్-90.47)
8. నిజామాబాద్ జిల్లా తానా కుర్దు (స్కోర్-90.3)
9. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుక్నూర్ (స్కోర్-90.28)
10. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి (స్కోర్-90.25)