Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్, పదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షలతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పైనా గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లో కలెక్టర్లు, వివిధ అధికారులతో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లు, అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యాశాఖ అధికారులతో చర్చించనున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి తగు ఆదేశాలు ఇవ్వనున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఎలా పనిచేయాలన్న అంశాన్ని ఆమె వివరించనున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, ఎస్పీలతోపాటు డీఈవోలు, డీఐఈవోలు, డీటీవోలు, టీఎస్ఆర్టీసీ, ట్రాన్స్కో, పోస్టల్ సూపరింటెండెంట్, ఇతర శాఖల అధికారులు పాల్గొననున్నారు. ఇంటర్ పరీక్షలు వచ్చేనెల ఆరు నుంచి 24వ తేదీ వరకు, పదో తరగతి పరీక్షలు వచ్చేనెల 23 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు, జూన్ 12న టెట్ రాతపరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.