Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ పరివాహక ప్రాంతంలో జీవో 111ను ఉల్లంఘించి మంత్రి కేటీఆర్ ఫాం హౌస్ నిర్మాణం చేశారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్‌రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. నిర్మాణం జరిగిన ఆరు నెలల్లోగా ఫిర్యాదు వస్తేనే ఎన్జీటీ విచారణ చేయాలన్న నిబంధనకు వ్యతిరేకంగా ఎన్జీటీ సంయుక్త కమిటీ దర్యాప్తు ఉత్తర్వులు ఇచ్చిందని ఆక్షేపించింది. నిర్మాణం, ఆ ప్రదేశ భూమితో తనకు సంబంధం లేదని కేటీఆర్ చెబుతున్నప్పుడు ఆయన వాదన వినకుండానే రేవంత్‌రెడ్డి పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు ఎన్టీజీ ఇవ్వడం సరికాదని పేర్కొంది. ఫాంహౌస్ తనదని ప్రదీప్‌రెడ్డి విడిగా హైకోర్టులో మరో కేసు వేశారనీ, తనను ప్రతివాదిగా చేయకుండా రేవంత్ ఎన్జీటీ నుంచి ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదనే పిటిషన్‌ను కూడా అనుమతిస్తు న్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన ్రావ్లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది.
పబ్‌లో డ్రగ్స్‌పై పిల్ విచారణ వాయిదా
బంజారాహిల్స్‌లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వాడకంపై దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన కేసు విచారణను హైకోర్టు ఆగస్టు నాలుగో వారానికి వాయిదా వేసింది. ఆ ఘటనపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని నివేదించాలని రేవంత్‌రెడ్డిని ఆదేశించింది.